ఆర్జీవీ తాజా సంచలనం GSTతో దాదాపుగా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక చాలా ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. వీడియో విడుదలైన తొలిరోజే ప్రేక్షకుల తాకిడికి సదరు వెబ్ సైట్ డౌన్ అయింది అంటే ఈ వీడియోకి ఎంతటి ఆదరణ లభించిందో అన్నది వేరే చెప్పక్కర్లేదు.
ఇక ఇంతటి విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో వర్మ GST పార్ట్ 2 కి సిద్ధం అవుతున్నాడు. ఇందుకుగాను ఒక ప్రకటన కూడా జరీ చేసేశాడు. దీనికి సంబంధించి ట్వీట్ చేస్తూ- మొదటి భాగానికి వచ్చిన ఇంతటి క్రేజ్ ని చూసాక తాను పార్ట్ 2 ని త్వరలోనే మొదలుపెడతాను అని చెప్పాడు. తన ఈ ప్రయత్నంలో తనకి GST లవర్స్ కి ఆ దేవుడి దయ ఉండాలి అని కోరుకుంటున్నాను.
మొత్తానికి మొదటి పార్ట్ తోనే అందరి మైండ్ బ్లాక్ చేసిన వర్మ ఇప్పుడు మరో పార్ట్ తో మరో సంచలనానికి తెరలేపనున్నాడు. మరి ఈ పార్ట్ 2 కి కూడా ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతోందో అలాగే ఈ పార్ట్ 2 లో మియా మల్కొవా ని ఇంకెలా ఆవిష్కరించనున్నాడో అన్నదాని పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక త్వరలోనే మనం వర్మ GST పార్ట్ 2 ని కూడా చూడొచ్చు.