ఇటీవల బాలీవుడ్ లో ఓ చిన్న సినిమా వచ్చింది. కానీ ఇప్పుడు అదే పెద్ద సంచలనమై కూర్చొంది. అదే.. కశ్మీరీ ఫైల్స్. 1990 లో కశ్మీర్‌లో అక్కడి పండిట్స్‌నిఊచ కోత కోశారు. ఆ విషాద దృశ్యాల్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. దాంతో.. ఈ సినిమా టాక్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే. దాంతో పాటు కొన్ని వివాదాలూ మొదలయ్యాయి. తాజాగా రాంగోపాల్ వర్మ ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. కశ్మీరీ ఫైల్స్ బాలీవుడ్ లో ఉన్న కొన్ని అపోహల్ని తొలగించిందని, స్టార్లు లేకున్నా, పెద్ద బడ్జెట్ లేకున్నా, పాటలు లేకున్నా సినిమా ఆడుతుందని నిరూపించిందని.. కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
హిట్ సాధించాలంటే పెద్ద స్టార్లు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో స్టార్లు లేకపోవడమే కాకుండా, సినిమా డిజైన్ స్టార్‌ని కలిగి ఉండకూడదు)
హిట్ సాధించడానికి మీకు మెగా బడ్జెట్‌లు అవసరం ( కాశ్మీర్ ఫైల్స్ చాలా తక్కువ బడ్జెట్)
హిట్ కావాలంటే మీకు సూపర్ హిట్ పాటలు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో ఒక్క థీమ్ తప్ప మరేమీ లేదు)
హిట్ చేయడానికి మీకు మసాలా వినోదం అవసరం (కాశ్మీర్ ఫైల్స్ లో మీరు ఒక్కసారి కూడా నవ్వలేరు)
హిట్ చేయడానికి మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి (కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గురించి ఎవరూ పెద్దగా వినలేదు)
మీరు హిట్ చేయడానికి అనేక కోట్ల ప్రమోషన్స్ కావాలి (రాధే శ్యామ్ 25 కోట్లతో పోలిస్తే కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు కేవలం 2.5 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేసారు)
ప్రేక్షకులు లాజిక్స్ లేని సినిమాలే చూస్తారని అనుకోవద్దు (ప్రేక్షకులు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గ్రాంట్‌గా తీసుకున్నారు)
ఛార్ట్ బస్టర్ పాటలను చూపించాల్సి ఉంటుంది (కాశ్మీర్ ఫైల్స్ లో ఎటువంటి ప్రయత్నం లేదు. హమ్ దేఖేంగే అనే బ్యాక్ గ్రౌండ్ థీమ్ మాత్రమే ఉంటుంది)
ఇలా చాలా పాయింట్స్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో కొన్ని పాయింట్లను షేర్ చేశారు.