`ఆర్.ఆర్.ఆర్` ఎప్పుడు మొదలెట్టారో, అప్పుడే అది ప్రాఫిట్‌బుల్ వెంచర్ అయిపోయింది. అయితే ఆ లాభాలెంత? ఎవరికెంత? అనే లెక్కలు విడుదల తరవాత గానీ తేలదు. ఈసినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాంలంటే దాదాపు రూ.600 కోట్లు తెచ్చుకోవాలి. ఆర్.ఆర్.ఆర్ ముందున్న అతి పెద్ద టాస్క్ అదే. `బాహుబలి` స్థాయిలోనే `ఆర్.ఆర్.ఆర్` కూడా ఉంటే, కనీసం 1000 కోట్లు దండుకోవడం ఖాయం. ఏ విషయంలో చూసినా, ఏ అంశంలో చూసినా `ఆర్.ఆర్.ఆర్` కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది.
అయితే వడ్డీలు కట్టడంలోనూ `ఆర్.ఆర్.ఆర్`దే రికార్డ్. ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయి దాదాపు ఆరు నెలలు కావొస్తోంది. సినిమా మొదలెట్టి, మూడేళ్లయ్యింది. అప్పటి నుంచీ.. వడ్డీలు కట్టుకుంటూ రావాల్సిస్తోంది. ఓ దశలో నెలకు రూ.8 కోట్లు వడ్డీల రూపంలో కట్టాల్సివచ్చిందట. ఓ రకంగా.. ఇది రికార్డే. 8 కోట్లంటే... ఓ మీడియం సైజు సినిమా తయారైపోతుంది. అంత మొత్తాన్ని వడ్డీల రూపంలో ఇవ్వాల్సివచ్చింది. వడ్డీల భారం లేకుండా ఉంటే, సినిమా అనుకున్న సమయంలో విడులైతే.. కచ్చితంగా మరో రూ.50 కోట్లయినా మిగిలేది.