'భైరవగీత'
'2.0' సినిమాని చిన్న పిల్లల సినిమాగా అభివర్ణించి రామ్‌గోపాల్ వర్మ పెను సంచలనానికే కారణమయ్యాడు. ఆ తర్వాత 'చిన్న పిల్లల సినిమా అంటే అదేమీ కించపర్చే ఉద్దేశ్యం కాదు' అని ఆయనే ఓ వివరణ ఇచ్చాడు. వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. '2.0' సినిమాతో 'భైరవగీత' సినిమాకి పోటీ పెట్టిన వర్మ, ఎందుకో ఆ రేసు నుంచి కొంచెం వెనక్కి తగ్గినట్టున్నాడు. 'సెన్సార్ సమస్యల కారణంగా' అంటూ సినిమా విడుదలను డిసెంబర్ 7కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు.
ఆ రోజున తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెల్సిందే. 'భైరవ గీత' డిసెంబర్ 7న వస్తోంది, తప్పకుండా ఓటేయండి.. అంటూ తన సినిమాకి ఎన్నికల ప్రచారం తరహాలో పబ్లిసిటీ చేసుకున్నాడు వర్మ సోషల్ మీడియా ద్వారా. వర్మ ఏం చేసినా అందులో కొత్తదనం కన్పిస్తుంటుంది. శిష్యుడు సిద్దార్ధని ప్రమోట్ చేయడం కోసం వర్మ తీసుకుంటున్న జాగ్రత్తల్ని అభినందించి తీరాల్సిందే.
ధనంజయ, ఇర్రా మోర్ జంటగా నటించిన 'భైరవగీత' సినిమాలో హాట్ కంటెంట్‌తోపాటుగా, బ్లడ్ కంటెంట్ ఎక్కువగా వుంటుందనీ, ఆ కారణంగానే సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయనీ ప్రచారం జరుగుతుండగా, ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి వుంది. ట్రైలర్ చూసినవారెవరికైనా ఇందులో హాట్ కంటెంట్, బ్లడ్ కంటెంట్ చాలా ఎక్కువగా వుందని అన్పించడం సహజమే. ఈ తరహా సినిమాలకు ఈ మధ్య డిమాండ్ కూడా ఎక్కువగా వుంటోంది. పైగా ఇది వర్మ శిష్యుడి సినిమా కదా.. ఆ మాత్రం 'డోస్' లేకపోతే ఎలా.?