'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో వర్మ ఏం చూపించబోతున్నారంటే.!

మరిన్ని వార్తలు


'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌':

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధించి తెలుగులో రూపొందుతోన్న బయోపిక్స్‌లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్‌' శరవేగంగా షూటింగ్‌ జరుగుతుండగా, మరోవైపు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' పేరుతో మరో బయోపిక్‌ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు 'భైరవగీత' అంటూ ఓ ఫ్యాక్షన్‌ లవ్‌స్టోరీకి నిర్మాణ సారధ్యం వహిస్తూనే రామ్‌గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాతో బిజీగా ఉన్నారు.

 

జనవరిలో గానీ, ఫిబ్రవరిలో కానీ ఈ సినిమాని విడుదల చేసే యోచనలో రామ్‌గోపాల్‌ వర్మ ఉన్నట్లు తాజా సమాచారమ్‌. అయితే క్రిష్‌ తెరకెక్కిస్తున్న బయోపిక్‌ ఎన్టీఆర్‌ సంపూర్ణ జీవితానికి సంబంధించినది. రెండు భాగాలుగా ఆయన దాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వర్మ అలా కాదు, ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ అయిన తర్వాత నుండి ఆయన జీవితగాధలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే పాయింట్‌ని మాత్రమే తీసుకున్నాడు.

 

ఆయన అదే పాయింట్‌ని హైలైట్‌ చేస్తూ, దాని వెనక ఉన్న కొన్ని చీకటి కోణాల్ని అలాగే మరికొన్ని మంచి, చెడుల్నీ కూడా తెరపై నిర్భయంగా చూపిస్తానంటున్నారు. వర్మ అంటేనే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌. ఆయన ఏం చేసినా అలాగే ఉంటుంది. అలాగే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రాన్ని కూడా పక్కా డేరింగ్‌తో రూపొందించనున్నారట. అయితే ఇంతవరకూ ఈ బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ అయిన 'లక్ష్మీపార్వతి' పాత్రను పోషించేదెవరో రివీల్‌ కాలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS