సంచలనాత్మకమైన యదార్ధ ఘటనల్ని సినిమాలుగా అనౌన్స్ చేయడం వర్మగారికి వెన్నతో పెట్టిన విద్య. అలా వర్మ అకౌంట్‌లో కౌంట్ అయిన కథలు చాలా ఉన్నాయి. కొన్ని దృశ్య రూపం దాల్చాయి. ఇంకొన్ని ప్రకటనల వరకూ పరిమితమైపోయాయి. ఇటీవలే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ ఓ సెన్సేషనల్ సినిమాని తెరకెక్కించి, వివాదాల పరంపరను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అంటూ టైటిల్ మార్చుకుందనుకోండి.
ఇదిలా ఉంటే, తాజాగా వర్మగారు మరో సంచలనాత్మక ప్రకటన వదిలారు. ఈ మధ్య దిశ అత్యాచార ఘటన, హత్య దేశాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఇదే తన సినిమాకి కథా వస్తువుగా ఎంచుకుని సినిమాని అనౌన్స్ చేసేశారు. ఈ సినిమాకి 'దిశ' అని టైటిల్ కూడా ప్రకటించారు. అయితే, ఈ సినిమాని వర్మగారు ఎప్పటిలోగా పట్టాలెక్కిస్తారనేది.? లెట్స్ వెయిట్ అండ్ సీ.