'ప్రతిరోజూ పండగే'తో ఓ సూపర్ హిట్టు అందుకున్నాడు మారుతి. ఆ తరవాత రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడనే వార్తలొచ్చాయి. 'రెడ్' తరవాత రామ్ నటించబోయే సినిమా ఇదే అని చెప్పుకున్నారు. సడన్ గా మారుతి ఎంట్రీ ఇచ్చి 'నేను రామ్ తో సినిమా చేయట్లేదు. ఆ వార్తలన్నీ పుకార్లు మాత్రమే' అని కొట్టి పడేశాడు. మరి ఈ వార్తలు ఎలా వచ్చినట్టు? ఎందుకు వచ్చినట్టు? నిజానికి రామ్ కోసం మారుతి కథ రాసుకున్నాడట. ఆమధ్య లైన్ కూడా వినిపించాడట. కొన్ని మార్పులతో మరోసారి రామ్ దగ్గరకు వెళ్లాడు మారుతి.
అయితే ఈ కథ రామ్ కి అంత గా ఎక్కలేదట. దాంతో 'ఈ కథ వద్దు.. మరో కథ చెప్పండి' అన్నాడట. దాంతో మారుతి హర్టయిపోయాడని టాక్. అందుకే... 'నేను రామ్ తో చేయట్టేదు' అంటూ మీడియాకి ఓ స్టేట్ మెంట్ ఇవ్వాల్సివచ్చింది. ఇదే కథని మారుతి మరో హీరోతో తీయడానికి సిద్ధమయ్యాడని, త్వరలోనే అందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. మరి ఆ హీరో ఎవరో చూడాలి.