రామ్‌, ర‌వితేజ‌, అఖిల్‌.. ఎవ‌రితో సెట్ అవుతాడో?

By iQlikMovies - August 12, 2020 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఏమిటో ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. కాక‌పోతే.. చాలామంది హీరోల్ని క‌లిసి క‌థ‌లు చెప్పారాయ‌న‌. రామ్ - సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అఖిల్ పేరు కూడా వినిపిస్తోంది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` త‌ర‌వాత అఖిల్ సినిమా సురేంద‌ర్ రెడ్డితోనే అన్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించ‌బోతోంది. అయితే.. సూరి ర‌వితేజ‌కీ ఓ క‌థ చెప్పార‌ని తెలుస్తోంది. కిక్ తో సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అనిపించుకుంది ఈ జోడీ. ఆ త‌ర‌వాత‌.. కిక్ 2 తీస్తే.. అది ఫ్లాప్ అయ్యింది. అయినా సూరిపై ర‌వితేజ‌కు చాలా న‌మ్మ‌కం. అందుకే ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. కాక‌పోతే... ర‌వితేజ చాలా బిజీ. ఆయ‌న చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అవ‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తే గానీ.. సురేంద‌ర్ రెడ్డి కాంబో సెట్ అయ్యే ఛాన్సు లేదు. రామ్‌, అఖిల్ ల‌లో ఒక‌రితో సినిమా మొద‌ల‌య్యే ఛాన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఆ హీరో ఎవ‌రో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS