ఓటిటి బాటపడుతున్న రామ్ రెడ్?

మరిన్ని వార్తలు

దాదాపుగా ఐదు నెలల నుంచి థియేటర్లు మూసి ఉండడంతో సినిమా రిలీజులకు ఇబ్బంది ఏర్పడింది. కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీ వేదికల ద్వారా డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. కొందరు నిర్మాతలు మాత్రం సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తామంటూ వేచి చూస్తున్నారు. అయితే మరో మూడు నాలుగు నెలలు థియేటర్ల తెలిసే అవకాశం లేకపోవడం తెరిచిన ప్రేక్షకులు మునుపటిలా వస్తారో రారో తెలియకపోవడంతో మిగతావారు కూడా రిలీజ్ మొగ్గుచూపుతున్నారు.

 

తాజా సమాచారం ప్రకారం ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'రెడ్' కూడా ఓటీటీ వేదిక ద్వారా రిలీజ్ కానుందని అంటున్నారు. నిజానికి 'రెడ్' ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా క్రైసిస్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈమధ్య అమెజాన్ ప్రైమ్ వీడియో వారు 'రెడ్' నిర్మాతలకు మంచి ఆఫర్ ఇచ్చారట. దీంతో ఇకపై ఆలస్యం చేయడం అనవసరమని భావించి డీల్ క్లోజ్ చేశారని సమాచారం.

 

త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. తమిళ సూపర్ హిట్ 'తడమ్' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ సినిమాలో రామ్ కు జోడిగా మాళవిక శర్మ నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS