ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 5న ఆయనకు కోవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచీ.. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయితే క్రమంగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. లైఫ్ సపోర్ట్ యంత్రాలు అమచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
నిజానికి వైద్యులు హోం ఐసోలేషన్‌లో ఉండమని సూచించారు. కానీ బాలు ఒప్పుకోలేదు. కుటుంబభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తానే ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని బాలు ఓ వీడియో ద్వారా అభిమానులకు తెలియపరిచారు. కరోనా లక్షణాలు చాలా స్పల్వంగా ఉన్నాయని, భయపడాల్సిన పని లేదని చెప్పారు. తొలుత కోలుకున్నట్లుగా కనిపించినా.. నిన్న సాయంత్రం హఠాత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స ప్రారంభించారు. బాలు త్వరగా కోలుకోవాలని లక్షలాది సంగీతాభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల ఆశీస్సులు దీవెనలే బాలు బలం. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఐక్లిక్ మూవీస్.