'ఉన్నది ఒక్కటే జిందగీ' ఫస్ట్‌లుక్ రిలీజయ్యింది. లైఫంతా హ్యాపీగా ఉండాలి అన్నట్లుగా ఉంది ఫస్ట్‌లుక్. రామ్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ సినిమా ఇది. అనుపమా పరమేశ్వరన్, లావణ్యత్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ఫ్రెండ్‌షిప్, అండ్ లవ్ ఈ రెండింటి ప్రాధాన్యతని తెలిపే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'నేను శైలజ'తో మంచి హిట్ ఇచ్చాడు కిషోర్ తిరుమల, యంగ్ హీరో రామ్‌కి. అదే తరహాలో కాన్సెప్ట్ పాతదే అయినా కానీ కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సినిమాతో. 'ఉన్నది ఒక్కటే జిందగీ' అనే టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా రేపు ఈ సినిమా నుండి ఓ పాటను రిలీజ్ చేయబోతున్నారు. 'ట్రెండు మారినా ఫ్రెండు మారడు' అని సాగే ఈ సిట్యువేషనల్ సాంగ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో అదిరిపోయే బాణీలతో యూత్‌కి ఊపునివ్వనుంది. ఇకపోతే రామ్ 'నేను శైలజ'తో కొట్టిన హిట్ ఫార్ములానే ఈ సినిమాతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. మధ్యలో 'హైపర్' సినిమాతో కొంచెం రిలాక్స్ అయినా కానీ, టోటల్‌గా కథల ఎంపికలో వైవిధ్యాన్ని వెతుకుతున్నాడు. శ్రీవిష్ణు కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమాలో. రామ్ పాత్ర కొత్తగా స్టైలిష్‌గా డిజైన్ చేశాడు డైరెక్టర్. గెడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో తొలిసారిగా కొత్త లుక్ ట్రై చేశాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్తం త్వరలోనే ఊటీ బయలుదేరనుంది.