రాజమౌళి గురించి నమ్మలేని నిజాలు చెప్పిన రమా రాజమౌళి!

మరిన్ని వార్తలు

ఇంకొన్ని గంటల్లోనే బాహుబలి 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ తరుణంలో దర్శకుడు రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవి బయటపెట్టింది మరెవరో కాదు, ఆయన సతీమణి రామా రాజమౌళి.

బాహుబలి 2 కి సంబందించిన ప్రమోషన్ల లో భాగంగా ఆమె మాట్లాడుతూ- రాజమౌళికి తిండి పైన పెద్ద ద్యాస ఉండదని కాకపోతే స్వీట్స్ అంటే మాత్రం బాగా ఇష్టపడతాడని చెప్పింది.

ఇక తనకి డ్రెస్సింగ్ పైన కాని అలాగే డబ్బుకి సంబందించిన విషయాల పై పెద్దగ ఆసక్తి చూపడని అసలు సీక్రెట్ చెప్పేసింది. ఇక రాజమౌళి కి ఉన్న అతిపెద్ద బలహీనతల్లో ఒకటి అతని ‘మతిమరుపు’. చాలా సమయాల్లో టీవీ రిమోట్ ని సెల్ ఫోన్ అనుకోని జేబులో పెట్టేసుకుంటాడు అని చెప్పింది.

తను ఇన్నివిషయాల్లో సరిగా లేకపోయినా సినిమా వరకు వస్తే మాత్రం ఒక ముని లా మారిపోతుంటాడు అని చెప్పింది. సినిమా తప్ప వేరే ఏమి అలోచించడని, ఒకవేళ ఆలోచించిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని కుండబద్దలు కొట్టేసింది.

మొత్తానికి ఈ జక్కన్నకి సినిమా కాకుండా వేరే ఏమి తెలియదని నిర్మొహమాటంగా చెప్పింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS