ప్రముఖ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైరా సాంధు నిన్న రాత్రి దుబాయ్ లో బాహుబలి 2 ప్రివ్యూ చూసాడట.
ఈ ప్రీమియర్ అయిపోయిన వెంటనే తన ఆనందాన్ని వరుస ట్వీట్ల ద్వారా అందరితో పంచుకున్నాడు. ఈ చిత్రం ఖచ్చితంగా భారతదేశ కీర్తిని పెంచుతుంది అని స్పష్టం చేశాడు. అదే సమయంలో డైరెక్టర్ రాజమౌళి కి హ్యాట్స్ ఆఫ్ అంటూ అతని పై ప్రశంసల జల్లు కురిపించాడు.
సినిమాలో ఎక్కడ ఒక్క డల్ మూమెంట్ కూడా లేదని, పైగా VFX, సౌండ్, కెమెరా విభాగాల్లో ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఘంటా పదంగా చెప్పాడు.
నటనపరంగా ప్రభాస్, రానా, అనుష్క, రమ్య కృష్ణ, నాజర్, సత్యరాజ్ తమ పాత్రల్లో జీవించేశారు అని తెలిపాడు. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చరిత్ర సృష్టిస్తుంది అని ధీమా వ్యక్తం చేశాడు.
ఇదంతా చెప్పిన, ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పలేడు. సో లెట్స్ వెయిట్ ఫర్ రిలీజ్..