మాచో హీరో గోపీచంద్, శ్రీవాస్ ల 'రామబాణం' యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రాజమండ్రిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ సినిమా ప్లాట్ లైన్ ని రివిల్ చేసింది.
“ఈ క్షణం, ఈ ప్రయాణం.. నేను ఊహించినది కాదు, ప్లాన్ చేసింది కాదు' అని గోపీచంద్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైయింది. డింపుల్ హయాతి కోల్‌కతా నుంచి వ్లాగర్‌గా పరిచయం అయ్యింది. లవ్ ట్రాక్ యూత్ ని ఆకట్టుకుంటుంది. తర్వాత జగపతి బాబు ఆరోగ్యకరమైన ఆహరం, ఆరోగ్యకరమైన బంధాలు ప్రాముఖ్యత గురించి చెబుతూ గోపీచంద్ సోదరుడిగా ఎంట్రీ ఇచ్చారు.
జగపతి బాబు మంచి ఉద్దేశం, కార్పొరేట్ మాఫియా రూపంలో అతనకి కుటుంబానికి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఇద్దరు బ్రదర్స్ కలిసి వారితో ఎలా పోరాడుతారు అనేది కీలకాంశం. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించారు, అతని స్టంట్స్ మాస్‌ని ఆకట్టుకున్నాయి. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. జగపతి బాబు ఎప్పటిలానే హుందాగా కనిపించారు. డింపుల్ హయాతి గ్లామర్ విందు ఇచ్చింది.
యాక్షన్, కామెడీ సీక్వెన్స్‌లను డీల్ చేయడంలో శ్రీవాస్ తన మార్క్ చూపించాడు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా చూసుకున్నాడు. మిక్కీ జె మేయర్ నేపధ్య సంగీతం, వెట్రి పళనిసామి కెమరాపనితనం అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మించారు. ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా కనిపిస్తోంది. మొత్తానికి ఈ బాంబార్డింగ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.
సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదల కానుంది.