తమిళంలోకి అడుగుబెట్టిన రామజోగయ్య!

మరిన్ని వార్తలు

రామజోగయ్య శాస్త్రి – ప్రస్తుతం బాగా పాపులారిటీ ఉన్న తెలుగు రచయితల్లో ఈయన ఒకరు. ఈ మధ్య చాలా తెలుగు సినిమాలకి సింగిల్ కార్డు స్పెషలిస్ట్ గా ప్రాచుర్యం పొందాడు.

ఇక వివరాల్లోకి వెళితే, రామజోగయ్య శాస్త్రి ఈ మధ్యనే ఒక తమిళ పాటకి సాహిత్యం అందించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ తమిళ రచయత మదన కార్కి ట్విట్టర్ లో తెలుపుతూ రామజోగయ్య శాస్త్రి కి అభినందనలు తెలియచేసాడు. ఈ పాట త్వరలోనే మదన కార్కి కి చెందిన “డుపాడు” అనే వెబ్ సైట్ లో త్వరలో విడుదలకానుంది.

అయితే రామజోగయ్య శాస్త్రి తన కెరీర్ మొదట్లో కొన్ని కన్నడ సినిమా పాటలు కూడా రాసారు. ఇక రామజోగయ్య తెలుగులో లాగే తమిళంలో కూడా తన మార్క్  సాహిత్యం తో అందరిని అలరిస్తాడని ఆశిద్దాం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS