ప్రముఖ సినీనటి రంభ తన భర్త తో విడాకులు అలాగే తనకి తన పిల్లలకి భరణాన్ని ఇప్పించమని చెన్నై లోని ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి విదితమే.
అయితే తెలుస్తున్న వివరాల ప్రకారం, ఇంద్రన్ మళ్ళీ రంభతో కలిసి జీవించడానికి సుముఖత వ్యక్తం చేశారట. దీనితో ఫ్యామిలీ కోర్ట్ ఈ కేసుని కొట్టేసింది. మళ్ళీ వీరిరువురు కలిసి ఉండడానికి ఇంద్రన్ తీసుకున్న ఈ నిర్ణయంలో రంభదే కీలక పాత్ర అని తెలుస్తుంది.
ఇక వీరి వివాహం 2010లో జరిగింది అలాగే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెళ్లి అయ్యాక వీరు కెనడాలో ఉండేవారు.