ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రవాసాంధ్రుల్ని కలుసుకుంటున్నారు. అక్కడి సమస్యల్ని వినేందుకే పవన్ అమెరికా వెళ్లినా... ఓ వర్గం మాత్రం 'జనసేన' తరపున విరాళాలు సేకరించడానికే పవన్ ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారని వాదిస్తోంది. ఏదేమైనా.. పవన్ అమెరికా పర్యటన మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్కడి జససేనాని స్పీచులు ప్రవాసాంధ్రుల్ని కదిలిస్తున్నాయి. ఓ స్పీచ్ అయితే... మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ని తెగ ఆకట్టుకుంది.
పవన్ ఇచ్చిన ఓ స్పీచు చరణ్‌కి బాగా నచ్చేసింది. దాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నాడు చరణ్. అన్ని భయాల్లో కంటే అతి పెద్ద భయం మార్పు అని, దాన్ని దాటుకురావడానికి చాలా ధైర్యం చేయాలన్న సందేశం ఇస్తూ... పవన్ స్పీచ్‌ని అభిమానులతో పంచుకున్నాడు. తన జీవితంలో తాను విన్న, చూసిన ఉత్తేజపూరితమైన, స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇదేనని కితాబిచ్చాడు చరణ్.
అన్నట్టు ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న 'అంతరిక్షం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. ఈ వేదికపై పవన్ గురించి ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.




