ప్ర‌భాస్ గెస్ట్ హౌస్‌ని సీజ్ చేసిన అధికారులు

By iQlikMovies - December 18, 2018 - 11:42 AM IST

మరిన్ని వార్తలు

యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్‌కి ప్ర‌భుత్వ అధికారులు షాక్ ఇచ్చారు.  రాయ‌దుర్గం స‌మీపంలో ప్ర‌భాస్ కి ఓ గెస్ట్ హౌస్ ఉంది.  ‘పైగా’ భూముల సంబంధించిన స్థ‌లంలో ప్ర‌భాస్ గెస్ట్ హౌస్ నిర్మించారు. 84.30 ఎకరాల ఈ స్థ‌లం కోర్టు గొడ‌వ‌ల్లో ఉండేది. ఈ స్థలం పూర్తిగా ప్ర‌భుత్వానిదే అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అందుకే ఈ  స్థ‌లంలో నిర్మించిన అక్ర‌మ క‌ట్ట‌డాల్ని ప్ర‌భుత్వ అధికారులు సోమ‌వారం కూల్చేశారు.

 

ఈ స్థలానికి  సమీపంలోనే ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ ఉంది. ప్ర‌భుత్వ అధికారులు వ‌చ్చిన స‌మ‌యంలో ప్రభాస్ గెస్ట్ హౌస్ వ‌ద్ద‌ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసులు అంటించి తాళాన్ని సీజ్‌ చేశారు. ప్రభుత్వ స్థలం అని ధృవీక‌రిస్తూ... బోర్డుపై నోటీసులు ఏర్పాటు చేశారు. ఈ అతిథి గృహం విలువ దాదాపు రూ.15  కోట్లుంటుంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS