ట్రిపుల్ సెంచరీతో దుమ్ములేపిన రాముల ఓ రాముల.

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం సంగీతప్రియులను భారీగా మెప్పించింది. ఈ సినిమాలోని పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి.

 

ఆ ట్రెండ్ కొనసాగిస్తూ తాజాగా రాములో రాముల లిరికల్ సాంగ్ వీడియో యూట్యూబ్ లో 300 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటింది. ఇలా ఓ లిరికల్ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటడం సౌత్ ఇండియా మొత్తం మీద రికార్డని అంటున్నారు. ఈ పాటకు 1.5 మిలియన్ లైక్స్ కూడా లభించడం విశేషం. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు కాసర్ల శ్యామ్. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS