రాజమాత శివగామి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఈమెకి పలువురు సెలబ్రిటీస్ బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. డైరెక్టర్ కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ అన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. గ్లామరస్ హీరోయిన్‌గానే కాకుండా, పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. 'బాహుబలి' సినిమా ఒక ఎత్తు. 'శివగామి'గా రమ్యకృష్ణ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రాజమాతగా ఆమె పర్‌ఫామెన్స్ అందన్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. రాజమాత కాదు ఇండస్ట్రీకే మాతగా శివగామిని అభివర్ణించొచ్చు. ఆ పాత్రకి ఆమె తప్ప మరొకర్ని ఊహించుకోవడం చాలా కష్టం. గతంలోనూ ఈ తరహా పర్‌ఫామెన్స్ పాత్రలు చాలానే చేసింది రమ్యకృష్ణ. అవన్నీ ఆమె కీర్తిని ఓ స్థాయిలో నిలబెట్టినవే. ఇంత వయసులోనూ గ్లామర్‌లో ఆమెకి సాటి ఎవరూ లేరు. 'నరసింహ' సినిమాలో రజనీకాంత్‌తో పోటీ పడి నటించింది. ఆమె నటనకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ఆశ్చర్యపోయారు. నట విశ్వరూపం చూపించేసింది. న భూతో న భవిష్యతి అలాంటి పాత్ర మళ్లీ రమ్యకృష్ణకి వస్తుందా? అనుకున్నారు. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది. ఈ తరం హీరోలైన ఎన్టీఆర్, ప్రబాస్‌లతోనూ ఆడి పాడింది. గ్లామరస్ హీరోయిన్‌గా, తల్లిగా, చెల్లిగా, అత్తగా పలు క్యారెక్టర్స్‌తో మెప్పించిన శివగామి ఇలాంటి బర్త్‌డేలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఆమెకి బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే టు శివగామి.