'స్పైడర్‌'ని భయపెడుతున్న లీక్‌ భూతం

మరిన్ని వార్తలు

తాజాగా విడుదలైన 'స్పైడర్‌' ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే ట్రైలర్‌ ముందుగానే లీక్‌ అయిపోయింది. ఆ కారణంగానే ఏ హడావిడీ లేకుండా సోషల్‌ మీడియాలో ట్రైలర్‌ని విడుదల చేసేసింది చిత్ర యూనిట్‌. ఈ రోజు హైద్రాబాద్‌లో ఆడియో వేడుక జరగనుంది. ఈ వేడుకలో ట్రైలర్‌ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ లీకేజీ కారణంగా ముందుగానే విడుదల చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీని ఈ లీకేజీ భూతం పట్టి పీడిస్తోంది. మొన్నీ మధ్యనే అఖిల్‌ కొత్త సినిమా 'హలో' స్టిల్‌ కూడా ఇలాగే లీక్‌ అయిపోయింది. దాంతో సోషల్‌ మీడియాలో వెంటనే నాగార్జున ఆ స్టిల్‌ని రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. అలాగే 'జై లవకుశ'లో జై స్టిల్‌ కూడా ఇలాగే లీక్‌ అయిపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాలు అర్ధాంతరంగా ఇలా లీక్‌ అయిపోవడం అనేది ప్రమాదకరమైన విషయంగానే భావించాలి. 'స్పైడర్‌' అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ. ఈ సినిమా విషయంలో లీకేజీ పెను సమస్యగా మారిందనే చెప్పాలి. చిత్ర యూనిట్‌ ప్రతీక్షణం భయపడుతూనే ఉన్నారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్‌ - రకుల్‌ కెమిస్ట్రీ గురించే అంతా చర్చించుకుంటున్నారు. సూపర్బ్‌ కెమిస్ట్రీ అంటూ ప్రశంసిస్తున్నారు. ట్రైలర్‌లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ఈ జంట ఎంతగా ఆకట్టుకుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS