బాహుబలి తరవాత రమ్యకృష్ణ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తను కూడా ఆషామాషీగా సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. ఓ పద్దతి ప్రకారం తన కెరీర్‌ని ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు పూరి తనయుడు ఆకాష్‌పూరి సినిమా `రొమాంటిక్`లో నటించడానికి ఓకే చెప్పింది. పూరి ఈ చిత్రానికి నిర్మాత. తనే కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించాడు.
అనిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. త్వరలోనే రమ్యకృష్ణ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రమ్యది చాలా కీలకమైన పాత్ర అని, కాల్షీట్లు కూడా ఎక్కువగా కేటాయించిందని, రమ్యకి భారీ పారితోషికం ముట్టజెప్పారని తెలుస్తోంది.