రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన భళ్లాలదేవ.!

By Inkmantra - October 25, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

గత కొంతకాలంగా రానా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, విదేశాల్లో చికిత్స పొందుతున్న కారణంగా సినిమాలకు బ్రేకిచ్చేశాడంటూ రూమర్స్‌ వస్తున్నాయి. ఈ విషయమై సురేష్‌ బాబు గతంలో క్లారిటీ ఇచ్చినా రూమర్స్‌ ఆగడం లేదు. దాంతో రానా అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఫ్యాన్స్‌ కోసం రానా స్పందించాడు. తను స్వయంగా చెప్పే వరకూ రూమర్స్‌ని నమ్మవద్దని ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చాడు.

 

దాంతో ఫ్యాన్స్‌లో కలత కొంతవరకూ తీరినట్లే. మరోవైపు రానా చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. రూమర్స్‌ దారి రూమర్స్‌దే. రానా పని రానాదే. కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ అనే తేడా లేకుండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌లో రానా నటించిన 'హౌస్‌ఫుల్‌ 4' లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

అక్షయ్‌ కుమార్‌, బాబీ డియోల్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్దే తదితరులు నటించిన ఈ సినిమాలో రానా కీలక పాత్ర పోషించాడు. అది కూడా నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర కావడం విశేషం. ఈ రోజు వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది. ఇక తెలుగులో వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌. టబు, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితో పాటు రానా చేతిలో '1945', 'హాథీ మేరీ సాథీ' తదితర ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు మరిన్ని ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS