తెలుగులో 'బాహుబలి' సినిమాతో 'భళ్లాలదేవ' సార్ధక నామధేయుడయ్యాడు రానా. తెలుగులోనే కాకుండా, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా రానా దూసుకెళ్లిపోతున్నాడు. అలాగే తెలుగులో గ్లామరస్ పాత్రల్లో బబ్లీ గాళ్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీ బాలీవుడ్‌లో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఘాజీ'. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో స్పెషాలిటీ సబ్‌మెరీన్. ఇంతవరకూ సబ్‌మెరీన్ కథాంశంతో ఏ చిత్రమూ తెరకెక్కలేదు. 1971కి ముందు జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియా - పాకిస్థాన్ యుద్ధం నేపధ్యంలో నీటిలో జరిగే యుద్దాలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాలో రానా నావికాదళ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. సబ్‌మెరీన్‌ను ట్రైలర్‌లోనే చాలా అద్భుతంగా చూపించారు. ఇక సినిమాలో ఇంకెంత బాగా చూపించి ఉంటారో అని అభిప్రాయ పడుతున్నారు సినీ జనం. అంతేకాదు ట్రైలర్‌లో రానా చెప్పే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాప్సీకి బాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. వాటిన్నింటిలోకెల్లా ఈ సినిమా మరింత గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది. 'బాహుబలి'ని మించిన గొప్ప సినిమాగా రానాకి ఈ సినిమా గుర్తుండిపోనుంది అంటున్నారు. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. హిందీలో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇంతవరకూ ఏ ఒక్కరూ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది. అద్భుతమైన సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోనుంది.