బుల్లితెరపై భళ్లాదేవ మళ్లీ వస్తున్నాడు

మరిన్ని వార్తలు

గతంలో రానా హోస్ట్‌గా వ్యవహరించిన ‘నెం 1 యారి’ నెక్స్‌ట్‌ సీజన్‌ త్వరలో ప్రసారం కానుంది. ఈ సారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ ప్రోగ్రామ్‌ రానుందంటూ రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ప్రోమో ప్రోగ్రామ్‌పై హైప్‌ పెంచేస్తోంది. స్టార్‌ సెలబ్రిటీల్ని ఇంటర్వ్యూ చేస్తూ, వారి నుండి ఆసక్తికరమైన విషయాలను బయటికి తెప్పించే రానా, ఈ సీజన్‌ యారి కోసం సరికొత్తగా ముస్తాబైపోయాడు. రానా ప్రస్తుతం నటిస్తున్న ‘అరణ్య’ మూవీ కోసం విశేషంగా బరువు తగ్గిన సంగతి తెలిసిందే. భళ్లాదేవగా భారీ కాయంతో కనిపించిన రానా, ఇప్పుడు వయసుకు తగ్గ లుక్స్‌లోకి మేకోవర్‌ అయిపోయాడు. యంగ్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కిర్రాక్‌ పుట్టిస్తున్నాడు.

 

ఇక త్వరలో అంటే, ఏప్రిల్‌ 2న రానా నటించిన ‘అరణ్య’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. మరోవైపు ‘విరాట పర్వం’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రానాకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది. సో ఈ ఏడాది ఇటు పెద్ద తెర పైనా అటు బుల్లితెర పైనా కూడా రానా ఫుల్ గా సందడి చేయనున్నాడన్నమాట


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS