ప్రజంట్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. సినీ స్టార్స్ కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీ లకి చెందిన స్టార్స్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. గత ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. రౌడీ బాయ్స్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మాన్ గా మారిపోయాడు. ఇప్పుడు తాప్సీ పన్ను కూడా పెళ్లి వార్త చెప్తోంది.
ఉత్తరాది అమ్మాయి అయిన తాప్సి సౌత్ సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసి, మంచి ఆదరణ పొందింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ఢిల్లీ భామ తరవాత బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది. బాలీవుడ్ లో తాప్సి నటించిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకం. అందరిలా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకి అవకాశమున్న పాత్రలు చేస్తూ, తన రూటే వేరంటూ ప్రూవ్ చేసుకుంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో డంకీతో మెరిసింది.
ఇప్పుడు తాప్సి పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ మథియస్ బోను తో పదేళ్లుగా తాప్సి రిలేషన్ లో ఉన్నట్లు గతేడాది తమ బాండింగ్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అతనితో కలిసి ఏడడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సిక్కు, క్రైస్తవ పద్ధతిలో జరిగే ఈ వివాహానికి త్వరలోనే డేట్ కన్ఫర్మ్ చేస్తారని టాక్. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు, ఇందుకు ఉదయపూర్ వేదిక కానుందని సమాచారం. ఈ వేడుకకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కానున్నారట. ప్రైవేట్ ఈవెంట్ గానే ఈ వివాహాన్ని జరుపుకోవాలని తాప్సి, తన ప్రియుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.