దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప' అని అప్పుడెప్పుడో దర్శకుడు గుణశేఖర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ సినిమా స్టేటస్ ఏంటనేది ఎవరికీ తెలియ రావడం లేదు. లేటెస్ట్‌గా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ఈ సినిమా గురించి ప్రస్థావించారు. ఈ సినిమాని వర్చువల్ రియాలిటీ మూవీగా రూపొందించబోతున్నామనీ, అందుకోసం ప్రత్యేకమైన సెట్స్ రూపొందిస్తున్నారనీ, ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కా పర్‌ఫెక్ట్‌గా జరుగుతున్నాయనీ చెప్పారు.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాంశంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఓ త్రీడీ స్కానింగ్ కంపెనీతో రానా అండ్ టీమ్ అసోసియేట్ అయ్యారట. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. ఇది కంప్లీట్ అయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టొచ్చనీ, అంతా పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాకే సినిమా సెట్స్ మీదికి వెళుతుందనీ, బహుశా అది వచ్చే ఏడాది చివరలో జరుగుతుందనీ రానా చెప్పారు. ఆ లోగా తాను పూర్తి చేయాల్సిన మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, 'బాహుబలి' మాదిరిగా ఫోకస్ మొత్తం ఆ సినిమా పైనే ఉంచాలనుకుంటున్నానని రానా తెలిపారు. ప్రస్తుతం రానా 'విరాట పర్వం' సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు, ఇతర భాషల్లోనూ పలు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది.