రాధ లేకుండా జోగేంద్ర లేడట. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలోనిది ఈ డైలాగ్. జోగేంద్రగా నటిస్తున్న రానా, సినిమాలో రాధని ఉద్దేశించి ఈ డైలాగ్ చెప్పాడు. ఈ కొత్త డైలాగ్‌ని కొత్త టీజర్ ద్వారా తీసుకొచ్చారు. అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు కానుకగా స్పెషల్ టీజర్‌ని డిజైన్ చేసి విడుదల చేసింది 'నేనే రాజు నేనే మంత్రి' టీమ్. రాధ లేనిది జోగేంద్ర లేడనే డైలాగ్ రానా చెప్పాడంటే, సినిమాలో రాధ పాత్ర చాలా కీలకం అని అర్థం చేసుకోవాలి. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా గురించి మొట్టమొదట వినిపించిన గాసిప్స్ ఏమిటంటే ఇది లేడీ ఓరియెంటెడ్ కథాంశమని.
అయితే సినిమా టీజర్ వచ్చిన తర్వాత ఇది 'లీడర్' సినిమాకి కొనసాగింపుగా ఉంటుందని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త స్పెషల్ టీజర్‌తో ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఏదేమైనప్పటికీ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాపై చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. నిర్మాణ సమయంలోనే సినీ వర్గాల్లో ఈ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఇంకో వైపున కాజల్ అగర్వాల్ తొలి తెలుగు సినిమా 'లక్ష్యీకళ్యాణం'. ఈ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఆమెకు 50వ సినిమా. తొలి సినిమాతో పాటుగా యాభయ్యవ సినిమాని కూడా ఒకే దర్శకుడితో చేయనుండడం చాలా అరుదైన విషయం ఏ హీరోయిన్‌కి అయినా.