రణ్‌బీర్-కత్రినాకైఫ్ ల మధ్య జరిగిన ప్రేమాయణం గురించి బహుశా తెలియని వారుండరు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు పోయిన ఏడాది ఇరువురు విడిపోయారు.
ఇప్పుడు వీరు ఇద్దరూ జంటగా నటించిన చిత్రం 'జగ్గా జాసూస్' చిత్రం రిలీజ్ కి సిద్ధ్ధం అయింది. ఆ చిత్ర ప్రమోషన్ల లో భాగంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ - మేము ఇద్దరం కలిసి నటించే చివరి చిత్రం ఇదే అవ్వొచ్చు అని అందరికీ షాక్ ఇచ్చింది. దీని పై రణ్‌బీర్ స్పందన ఏంటి? అని అడగగా సమాధానం దాటవేసాడు.
వీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో వీరిరువురిని జంటగా చిత్రాలను తెరకెక్కిద్దాము అనుకునే వారికి ఇది షాక్ అనే చెప్పాలి.
మొత్తానికి ఒక ముచ్చటైన జంటని వెండితెర పై చూసే అవకాశం ప్రేక్షకులకి లేకుండా పోయింది.