అచ్చం చంద్రబాబులాగే.!

మరిన్ని వార్తలు

అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్‌'లో దగ్గుబాటి రానా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు రానా. 

తాజాగా ఆ గెటప్‌లో రానా ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఆ వయసులో చంద్రబాబు ఎలా ఉన్నాడో రానా అచ్చం అలాగే ఉన్నాడు. ఎవరూ ఊహించని విషయమిది. అఫీషియల్‌గా ఈ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఇటీవల రానా షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నారా చంద్రబాబు నాయుడి పాత్ర చాలా కీలకమైనది. అలాగే చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్‌ కూడా అత్యంత కీలకమైనదే. అయితే ఈ సినిమాలో ఆ ఎపిసోడ్‌ చూపిస్తారా? లేదా? అనే విషయమై సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడి పాత్రను నెగిటివ్‌ చేసి చూపించే అవకాశం లేదు. అందుకే ఎన్టీఆర్‌ జీవిత గాధని ఉన్నది ఉన్నట్లు తెరకెక్కిస్తే అభిమానుల మనోభావాలు దెబ్బ తినే అవకాశముంది. కాబట్టి వీలైనంత వరకూ కాంట్రవర్సీలకు దూరంగా ఎన్టీఆర్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించే ప్రయత్నం చేయనున్నారనీ తెలుస్తోంది. ఆయన జీవితంలోని చీకటి కోణాలను ఈ సినిమాలో టచ్‌ చేసే సాహసం చేయబోరనే టాక్‌ వినిపిస్తోంది. అయితే సినిమాపై ఆశక్తి క్రియేట్‌ అవ్వాలంటే ఆశక్తికరమైన అంశాలుండాలి. 

చూడాలి మరి వాటిని సినిమా కోసం అనుకూలంగా ఎలా మార్చుతారో. బాలయ్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమాకి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS