రుద్రమదేవి తరవాత గుణ శేఖర్ నుంచి మరో సినిమా రాలేదు. అప్పటి నుంచీ ఆయన `హిరణ్యకశ్యప` స్క్రిప్టుతోనే బిజీ. దాదాపుగా స్క్రిప్టు రెడీ అయిపోయింది. రానా కాల్షీట్లు ఇస్తే... ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కానీ రానా మాత్రం మిగిలిన సినిమాల్ని తప్ప, హిరణ్యని అస్సలు పట్టించుకోవడం లేదు. హిరణ్య కశ్యప తరవాత ఒప్పుకున్న సినిమాలన్నీ రానా పట్టాలెక్కిస్తున్నాడు. కానీ గుణశేఖర్ కి మాత్రం కాల్షీట్లు ఇవ్వడం లేదు. అంతెందుకు..? మొన్నటికి మొన్న మలయళ రీమేక్ `అప్పప్యయమ్ కోషియమ్`కి సంతం చేశాడు.
ఈ సినిమాని ఆగస్టులో మొదలెడతారని టాక్. రానా చేతిలో ఉన్న సినిమాల్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్లయినా పడుతుంది. అప్పటి వరకూ గుణశేఖర్ ఎదురు చూస్తాడా? అన్నది ప్రధాన ప్రశ్న. ఈసినిమా ప్రొడక్షన్లో సురేష్ ప్రొడక్షన్ కూడా భాగం పంచుకుంటోంది. అందుకే... గుణ శేఖర్ కూడా ఏమీ అనలేకపోతున్నాడని టాక్. మొత్తానికి గుణశేఖర్‌ని రానా పూర్తిగా టెన్షన్‌లోకి నెట్టేసినట్టైంది.