నిన్న టాలీవుడ్లో మూడు సినిమాలు విడులయ్యాయి. మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి ఈ మూడు సినిమాలకీ. ఇక ఓవర్సీస్లో అయితే ఈ మూడు సినిమాలు దున్నేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాకి ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు తెలియ వస్తోంది. ఏది ఏమైనా లాంగ్ వీకెండ్ కావడంతో మూడు సినిమాలు అక్కడ మంచి వసూళ్లు రాబడతాయనడంలో అతిశయోక్తి కాదు. ట్రేడ్ పండితుల నుండి వసూళ్ల విషయంలో అంచనాలు పోజిటివ్‌గా వస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ లాంగ్ వీకెండ్ కావడంతో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌కి కాసుల పంట పండిస్తాయనే అంచనా. రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తేజ డైరెక్షన్లో తెరకెక్కింది. కాన్సెప్ట్ కొత్తగా ఉండి, హీరోగా రానా ప్రెజెన్స్ పవర్ ఫుల్‌గా ఉండడంతో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది. అలాగే బోయపాటి శీను కొత్త టచ్‌తో ఇచ్చిన మాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ అయిన 'జయ జానకి నాయకా' సినిమాకి పోజిటివ్ వైబ్స్ బాగున్నాయి. ఇక నితిన్ 'లై'ని జనం బాగా ఆదరిస్తున్నారు. 'అ, ఆ..' సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న నితిన్ 'లై'తో సక్సెస్‌ని కంటిన్యూ చేశాడు. హను రాఘవపూడి ప్రయత్నం మరో సారి విజయం సాధించింది. మేఘా ఆకాష్ న్యూ లుక్స్ ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. టోటల్‌గా ఈ మూడు సినిమాల పోజిటివ్ టాక్‌తో ఈ వీకెండ్ సినీ ప్రియులకి మంచి విందే అందించనుందని చెప్పాలి.