రానా హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన వాళ్లంతా కాజల్, రానా మధ్య కెమిస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. అంత బావుంది ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ. ఈ ఇద్దరూ కలిసినప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో అలనాటి మేటి పాపులర్ సాంగ్ 'నెలవంక తొంగి చూసింది..' అంటూ పాట రావడం అందర్నీ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. పోసాని కృష్ణ మురళి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రానాది పొలిటికల్ లీడర్ పాత్ర. అంతేకాదు చాలా టిపికల్ క్యారెక్టర్‌లా కూడా కనిపిస్తోంది. స్క్రీన్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు రానా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. గతంలో తేజ సినిమాలకీ, ఈ సినిమాకీ మధ్య డిఫరెన్స్ బాగా చూపించినట్లు తెలుస్తోంది తేజ. ప్రస్తుత రాజకీయ పరిస్థితలపై సెటైర్లు బాగా ఉన్నాయనిపిస్తోంది ఈ సినిమాలో. ఈ సినిమా ఫస్ట్‌లుక్ నుండే సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనిపించేలా ఉంది. ఇటీవల వచ్చిన టీజర్‌తోనే సగం ప్రేక్షకుల్ని తన వైపుకు లాగేశాడు రానా. తాజాగా ట్రైలర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించేశాడు. ట్రైలర్ వచ్చినప్పట్నుంచీ, సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.