రానా కెరీర్ ఎప్పుడూ స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఛాన్సులు వస్తున్నాయి కదా, అని ఎడా పెడా సినిమాలు చేయడు. ఏదైనా సరే, ఆచి తూచి అడుగు వేస్తాడు. విరాట పర్వం తరవాత రానా నుంచి మరో సినిమా రాలేదు. కొత్త సినిమా కబురూ వినిపించలేదు. అయితే సడన్ గా `ట్రైన్ టికెట్ టైగర్` అనే ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో వదిలేశాడు రానా.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డిటైల్స్ చెబుతా అంటున్నాడు. చూస్తుంటే.. రానా టీసీగా నటించినట్టు అనిపిస్తోంది. పోస్టర్, అందులో రానా గెటప్ కొత్తగా ఉన్నాయి. అయితే ఇది సినిమానా, వెబ్ సిరీసా? లేదంటే యాడ్ షూటా? అనేవేం తెలియడం లేదు. ఇంత సస్పెన్స్ ఎందుకు పెట్టాడో అర్థం కావడం లేదు. సినిమా అయితే.. ఎప్పుడో ఒకప్పుడు దాని డిటైల్స్ బయటకు వచ్చేవి. ఏం రానివ్వకుండా.. సీక్రెట్ గా ఎలా చేశాడో ఈ సినిమా? చాలామంది.. ఇదంతా.. యాడ్ ఫిల్మ్ షూట్ అంటూ లైట్ తీసుకొంటున్నారు. యాడ్ ఫిల్మ్ అయినా సరే, గెటప్ బాగుంది. ఇది చూస్తే రానాతో ఈ తరహాలో ఓ సినిమా చేయొచ్చన్న ఐడియా కూడా పుట్టుకొస్తోంది. మరి ఈ గెటప్ వెనుక సీక్రెట్ ఏమిటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. వెంకటేష్ తో కలిసి చేసిన `రానా నాయుడు` వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.