రానా అలియాస్ భళ్ళాళదేవ నిన్న ఒక ‘పవర్’ ఫుల్ సెల్ఫీ దిగాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సెల్ఫీ గురించిన చర్చే నడుస్తున్నది.
వివరాల్లోకి వెళితే, రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కి వచ్చిన నేపధ్యంలో ఆయన గౌరవార్ధం గవర్నర్ ఇచ్చిన విందులో రాజకీయ, సినీ రంగాలకి చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందింది. దీనితో రాజకీయ నాయకుడి హోదాలో పవన్ కళ్యాణ్ రాగా హీరో రానా సినీ పరిశ్రమ నుండి ఈ విందుకి హజరయ్యాడు.
ఈ సందర్భంగా వారివురు విందు జరిగినంత సేపు కూడా పక్కపక్కనే ఉండటం ఇక ఆ సమయంలోనే రానా తన మొబైల్ ద్వారా పవన్ కళ్యాణ్ తో ఒక సెల్ఫీ దిగడం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటో అంతర్జాలంలో తెగ చక్కర్లు కొడుతున్నది.
ఇక ఇదే కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి రావడంతో మెగా బ్రదర్స్ ఇద్దరు ఈ మొత్తం విందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.