ప్రస్తుతం ఓటీటీ వేదికలదే హవా. వెబ్ సిరీస్‌లు ఉధృతంగా రూపొందుతున్నాయి. అందులో స్టార్స్ కూడా నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కథానాయికలైతే ఓటీటీల రూపంలోనూ భారీగా సంపాదిస్తున్నారు. తాజాగా శ్రుతిహాసన్ ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న `లస్ట్ స్టోరీస్` తెలుగు వెర్షన్ లో శ్రుతి కీలక పాత్ర పోషిస్తోంది.
ఇది కాకుండా శ్రుతి మరో వెబ్ సిరీస్‌కి ఓకేచెప్పింది. ఈసారి శ్రుతిహాసన్ రానాకి తోడుగా నటించబోతున్నట్టు టాలీవుడ్ టాక్. రానా - శ్రుతి జంటగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. నెట్ ఫిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ సినిమాని మించిపోయి ఉండబోతోందట. 10 ఎపిసోడ్లుగా రూపొందించే ఈ వెబ్ సిరీస్ ని అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. దర్శకుడెవరన్నది త్వరలో తెలుస్తుంది.