అదేంటి.. రానా అందరితోను సోషల్ గానే ఉంటాడు కదా. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేంటి అని అనుకుంటున్నారా!
ఇప్పుడు చెప్పబోయేది ఆయన తాజాగా చేస్తున్న వెబ్ సిరీస్ అయిన ‘సోషల్’ గురించి. వివరాల్లోకి వెళితే, ఒక వారంరోజుల క్రితం రానా ‘సోషల్’ అనే వెబ్ సిరీస్ లో నటించడం ప్రారంబించాడు.
ఈ వెబ్ సిరీస్ హిందీ, తెలుగు బాషలలో ఒకేసారి నిర్మితవనున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా ఎటువంటి వివరాలు తెలియనప్పటికీ, ఈ ‘సోషల్’ తో రానా మరో సంచలనానికి తెరలేపనున్నాడు అన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.
నేనే రాజు నేనే మంత్రితో పెద్ద కమర్షియల్ హిట్ అందుకున్న రానాకి ఈ సోషల్ ఎటువంటి బ్రేక్ ఇవ్వనుందో చూడాలి.