ఇప్పుడు హీరోలుగా సత్తా చాటుతున్న దగ్గుబాటి అందగాడు రానా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు చిన్నప్పుడు చాలా చిలిపి చేష్టలు చేసేవారట. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు చిన్నప్పట్నుంచీ కూడా. కలిసి చదువుకునే రోజుల్లో చిలిపిగా కాపీ కొట్టి ఎగ్జామ్ రాసిన తీరును సరదాగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు రానా. చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బుల్లి తెర ప్రోగ్రాం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన రానా ఈ చిలిపి అల్లరిని సరదాగా చిరంజీవితో పాటు, అభిమానులతో కూడా పంచుకున్నారు. ఈ ప్రోగ్రాంకి ముద్దుగుమ్మ తాప్సీ కూడా స్పెషల్ గెస్ట్‌గా వచ్చి ఈ ప్రోగ్రాంకి గ్లామర్ అద్దింది. రానా, తాప్సీ తాజా మూవీ 'ఘాజీ' విశేషాలను కూడా సరదాగా పంచుకున్నారు. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు వీరిద్దరూ. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ సినీ చరిత్రలోనే ఓ అద్భుతంగా ప్రశంసలు అందుకుంటోంది. సబ్‌మెరీన్ ప్రధాన నేపధ్యంగా తెరకెక్కింది ఈ చిత్రం. 'మామూలుగా సబ్‌మెరీన్‌లో నేను పట్టను' అని నవ్వుతూ చెప్పారు రానా. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు కదా రానా అందుకని. రానా తరువాతి చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం.