'బాహుబలి' సినిమాతో 'భళ్లాలదేవ'గా బిరుదు తెచ్చుకున్నాడు రానా. 'లీడర్'గా తొలి సినిమాతోనే బరువైన పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యమంత్రిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన 'లీడర్' సినిమా రానాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ, నెగిటివ్ రోల్లో నటించిన 'బాహుబలి' రానా కెరీర్ దశ తిరిగేలా చేసింది. ఆ తర్వాత నుంచి రానాను సొంత పేరు పెట్టి పిలిచేవాళ్ల కన్నా 'భళ్లాలదేవ' అంటూ సంబోధించేవాళ్లే ఎక్కువ. ఇప్పుడు మన భళ్లాలదేవ నటిస్తున్న తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్నాడు. తొలి సినిమా 'లీడర్'లో నటించిన అనుభవం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది రానాకి. ప్రస్తుతం అనంతపురంలో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చందమామ భామ కాజల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తేజ మార్క్ సినిమా కాకుండా ఈ సినిమాను కొత్తగా పొలిటికల్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ తేజ. మరో పక్క బాలీవుడ్లో రానా నటించిన 'ఘాజీ' సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇటు టాలీవుడ్లో 'బాహుబలి ది కన్‌క్లూజన్' షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లే. ఇలా అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో హీరో, విలన్ అనే తేడా లేకుండా దున్నేస్తున్నాడు రానా.