ఇంటెన్స్‌ లుక్స్‌లో రానా ఫ్రమ్‌ 'విరాట పర్వం'.!

By iQlikMovies - December 14, 2019 - 10:21 AM IST

మరిన్ని వార్తలు

భళ్లాలదేవ రానా ప్రస్తుతం 'విరాట పర్వం' సినిమాలో నటిస్తున్నాడు. ఎమర్జెన్సీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ముఖానికి ఎర్ర రంగు ఖర్చీఫ్‌ కట్టుకుని ఇంటెన్స్‌ లుక్స్‌లో రానా కనిపిస్తున్నాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో కొంతమంది గన్నులూ, జెండాలూ పట్టుకుని పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపిస్తోంది ఈ బ్యాక్‌ గ్రౌండ్‌. 'రివల్యూషన్‌ ఈజ్‌ ఏన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌' అనే క్యాప్షన్‌తో ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వదిలారు. పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో లీడ్‌ హీరోయిన్‌ రోల్‌ పోషిస్తుండగా, జెరీనా వాహిబ్‌, నందితా దాస్‌, ఈశ్వరీ రావ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీనియర్‌ నటి టబు ఓ ఇంపార్టెంట్‌ రోలో పోషిస్తోందనే ప్రచారం ఉంది కానీ, ఆమె పాత్ర విషయంలో క్లారిటీ లేదు. ప్రియమణి మరో కీలక పాత్ర పోషిస్తోంది. సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్‌ అందిస్తున్న 'విరాటపర్వం' సినిమాని సొంత బ్యానర్‌లో సురేష్‌ బాబు నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS