నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' మోషన్ పోస్టర్

By Inkmantra - March 29, 2020 - 12:35 PM IST

మరిన్ని వార్తలు

యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. ఈ నెల 30 న చిత్ర కథానాయకుడు నితిన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు 'రంగ్ దే' చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రం యూనిట్. చిత్ర నాయకా,నాయికలైన అను, అర్జున్ (నితిన్, కీర్తి సురేష్) లను పరిచయం చేస్తూ ఈ మోషన్ పోస్టర్ ముస్తాబయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS