చిత్రం: రంగబలి
నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో తదితరులు
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: పవన్ సిహెచ్
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
కూర్పు: కార్తీక శ్రీనివాస్
బ్యానర్స్: ఎస్ ఎల్ వి సినిమాస్
విడుదల తేదీ: 07 జులై 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
నాగశౌర్యకు లవర్ బాయ్ ఇమేజ్ వుంది. అయితే అదే ఇమేజ్ తోనే కెరీర్ నెట్టుకురావడం అంత ఈజీ కాదు. హీరోగా నిలబడాలంటే అన్ని రకాల పాత్రలు, కథలు చేయాలి. అందుకే శౌర్య రొమాంటిక్ ఎలిమెంట్స్ తో పాటు కమర్శియల్ అంశాలు వున్న కథలని చేయాడానికి మొగ్గు చూపుతుంటాడు. ఇప్పుడే కొలతలతో వచ్చింది రంగబలి. కొత్త దర్శకుడు పవన్ తో కలసి చేసిన ఈ చిత్రం నాగశ్వౌర్య కోరుకునే బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చిందా ? అసలు ఏమిటీ రంగబలి కథ ?
కథ: శౌర్య అలియాస్ షో (నాగశౌర్య) ఊరు రాజవరం. తనకి వూరు అంటే పిచ్చి ప్రేమ. సొంతూరులోనే కింగులా బతకాలని చిన్నప్పుడే డిసైడ్ పోతాడు. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఊళ్లోనే మెడికల్ షాపు నడుపుతుంటాడు. తన కొడుక్కు ఆ షాపు బాధ్యత అప్పగించాలన్నది ఆయన కోరిక. అయితే శౌర్య మాత్రం ఊళ్లో గొడవలు పెట్టుకుంటూ గాలికి తిరుగుతుంటాడు. కొడుకుని దారిలో పెట్టాలన్న ఉద్దేశంతో వైజాగ్ పంపించి ఫార్మసీ ట్రైనింగ్ చేయమని ఓ మెడికల్ కాలేజీకి పంపిస్తాడు. అక్కడే మెడికో సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు శౌర్య. వీళ్ల ప్రేమకు సహజ తండ్రి (మురళీ శర్మ) పచ్చజెండా ఊపేస్తాడు. అయితే శౌర్యది రాజవరం అని తెలిసి వెంటనే రెడ్ సిగ్నల్ వేస్తాడు. దీనికి కారణం ఆ ఊర్లోని రంగబలి సెంటర్. మరి ఆ సెంటర్ కథేంటి? దానికి రంగబలి అన్న పేరు ఎందుకొచ్చింది? ఈ సెంటర్ పేరు మార్చడానికి శౌర్య ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? ఈ క్రమంలో లోకల్ ఎమ్మెల్యే తో ఎలాంటి గొడవలు వచ్చాయనేది అసలు కథ.
విశ్లేషణ: రంగబలి కోసం కొంచెం వెరైటీ కథనే తీసుకున్నాడు. ఓ కుర్రాడు తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఒక వూరు సెంటర్ పేరు మార్చాల్సివస్తుంది. నిజంగా ఇలాంటి లైన్ తో తెలుగులో సినిమాలు రాలేదనే చెప్పాలి. ఐతే ఈ కథని ఇంటర్వెల్ వరకూ ఓపెన్ చేయలేదు. అయినా ఎలాంటి ఇబ్బంది వుండదు. ఫస్ట్ హాఫ్ ని శౌర్య అండ్ అగాధం పాత్రలో సత్య చేసే కామెడీతో భలే గమ్మత్తుగా నడిపేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఐతే సత్య సెకండ్ హీరో అవతారం ఎత్తేశాడు. సత్య పంచిన నవ్వులు మామూలుగా లేవు. తను కనిపించిన ప్రతి చోట నవ్వు గ్యారెంటీ.
విరామం నుంచి ఇందులో అసలు కథ మొదలౌతుంది. రంగబలి సెంటర్ పేరు మార్చడానికిహీరో చేసే బాంబు ప్రయత్నం భలే నవ్వు తెప్పిస్తుంది. ఐతే ఆ ఎపిసోడ్ తర్వాత రంగబలి వేగం , నవ్వులు ఒక్కసారిగా పడిపోతాయి. అసలు కథని నడపడంతో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. మంచి కథని ఎంచుకున్న దర్శకుడు దానిని ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం చేతులెత్తేశాడు. చాలా చోట్ల క్లూ లెస్ అయిపోయాడు. ఆరంభంలో ఎంత జోష్ వుంటుందో ఈ సినిమా ముగింపు అంత డల్ గా వుంటుంది. ఈ మధ్య కాలంలో ఇంత వీక్ క్లైమాక్స్ రాలేదు.
నటీనటులు: సొంతఊరులో కింగులా బ్రతికే కుర్రాడి పాత్రలో శౌర్య నటన ఆకట్టుకుంటుంది. శౌర్య పాత్రను చాలా యీజ్ తో చేశాడు. తెరపై చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. సహజ పాత్రలో యుక్తి స్క్రీన్ ప్రజన్స్ బావుంది. నటన కూడా డీసెంట్ గా వుంది. హీరో ఇమాజినేషన్ పాటలో అయితే గ్లామర్ గేట్లు ఎత్తేసిందనే చెప్పాలి. ఎదుటివాడు సంతోషపడితే తట్టుకోలేని అగాధం పాత్రలో సత్య పంచిన నవ్వులు చాలా కాలం గుర్తుండిపోతాయి. జాకెట్లు కుట్టే టైలర్ పాత్రలో రాజ్‌కుమార్ నవ్వులుపంచాడు. శరత్ కుమార్ పాత్ర కనిపించేది కొద్ది సేపైనా ఆకట్టుకుంటుంది. ఇందులో చాలా వీక్ విలన్ గా షైన్ టామ్ కనిపిస్తాడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
టెక్నికల్: పాటలు ఆకట్టుకునేలా లేవు. నేపధ్య సంగీతం మాత్రం బావుటుంది. కెమరాపనితనం కలర్ ఫుల్ గా వుంది, ప్రొడక్షన్ డిజైన్ కూడా బావుంది. కథకు తగ్గట్టు ఖర్చు చేశారు నిర్మాతలు. దర్శకుడికి వినోదంలో మంచి పట్టుంది. తొలిసగంలో వున్న వినోదం మలి సగంలో కూడా వుండివుంటే శౌర్యకి ఇది మరో విజయం అయ్యేది.
ప్లస్ పాయింట్స్
నాగశౌర్య, సత్య
ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
పాటలు
తేలిపోయిన క్లైమాక్స్
ఫైనల్ వర్దిక్ట్ : ఫస్ట్ హాఫ్ భలే...