మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రామ్‌చరణ్ 'రంగస్థలం' బాక్సాఫీస్‌కి రికార్డు స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతోంది. మొదటి వారాంతంలోనే 100కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం 'రంగస్థలం' 125 కోట్లు గ్రాస్ అందుకుందనీ సమాచారమ్. 75 కోట్ల షేర్స్‌తో సినిమా లాభాల బాట పట్టిందట. ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. కానీ అంచనాలు ఈ స్థాయిలో ఉన్నాయి. అయితే అంచనాల్ని మించే ఈ సినిమా లాభాలను అందుకుంటుందనీ, సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
చూడాలి మరి 'రంగస్థలం' వసూళ్లు 'బాహుబలి' వసూళ్లను కొల్లగొట్టే దిశగా పరుగులు పెడతాయో లేదో. సినిమా అయితే అన్ని వర్గాల వారినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. పిల్లా, పెద్దా, అభిమానంతో సంబంధం లేకుండా, ప్రతీ ఒక్కరూ సినిమాని ఆదరిస్తున్నారు. ఈ సినిమాతో చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. అన్నింటికీ మించి, త్వరలోనే చరణ్ - ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్‌లో నటించనున్నారన్న వార్త ఈ సినిమా షూటింగ్ టైంలోనే స్ప్రెడ్ కావడం మరో విశేషం. ఈ అంశం కూడా అభిమానులను, అభిమానేతరులను చరణ్ 'రంగస్థలం' వైపు ఆకర్షించేలా చేసింది.
ఏది ఏమైనా, కారణాలతో పని లేదు. 'రంగస్థలం' అంటే రంగస్థలమే. సినిమా హిట్టా? సూపర్ హిట్టా? అనే విషయం పక్కన పెడితే, ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి కథల్లో నటించి మెప్పించగల సత్తా రామ్‌చరణ్‌లాంటి చాలా కొద్ది మంది నటుల్లో మాత్రమే ఉంటుందనడానికి 'రంగస్థలం'లోని 'చిట్టిబాబు' పాత్రే చక్కని ఉదాహరణ.