'రంగస్థలం'తో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తదుపరి బోయపాటి శీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఆల్రెడీ మహేష్‌తో 'భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చరణ్, మహేష్‌ల గురించి తన మనసులోని అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది.
'చరణ్ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. ఆయనతో నటించేందుకు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాను..' అని చరణ్ గురించి కైరా తనదైన శైలిలో స్పందించింది. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇకపోతే ఆల్రెడీ మహేష్‌ని దగ్గర నుండి చూసిన కైరా అద్వానీ, మహేష్‌ని కూడా అలాగే పొగడ్తలతో ముంచేసింది. సెట్స్‌లో మహేష్‌బాబు చాలా సందడిగా, సరదాగా ఉంటారనీ, అందరితోనూ చక్కగా కలిసిపోయి నటిస్తారనీ, ఆయన్ని దగ్గర నుండి చూస్తే, సూపర్‌స్టార్ అనే గర్వం అస్సలు కనిపించదనీ మహేష్‌బాబు కోసం కైరా అద్వానీ చెప్పుకొచ్చింది.
ఇటీవల 'భరత్' నుండి విడుదలైన మహేష్ - కైరా అద్వానీ స్టిల్ సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది. ఇదిలా ఉంటే, అప్పుడే ఈ బ్యూటీ తెలుగు భాషపై పట్టు సాధించేస్తోందట. తెలుగులో ఇంకా మాట్లాడలేకపోతోంది కానీ, కొంచెం కొంచెం అర్ధం చేసుకోగలుగుతోందట. త్వరలోనే తెలుగులో మాట్లాడేస్తానంటోందీ ముద్దుగుమ్మ. ఈ రెండు సినిమాలే కాదు, మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తానని చెబుతోంది కైరా అద్వానీ.