రంగస్థలం మొదటివారం రికార్డుస్థాయి కలెక్షన్స్

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాని విస్తృతస్థాయిలో దూసుకుపోతున్నది.

నిన్నటివరకు అనగా సినిమా విడుదలైన మొదటివారంలో ఈ చిత్రం సుమారు రూ 80కోట్ల (షేర్) మేర వసూళ్ళు సాధించి ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఈ లెక్కల ప్రకారం, బాహుబలి యేతర రికార్డుని ఈ చిత్రం సాధించగలిగింది. దీనితో రామ్ చరణ్ ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు అని చెప్పాలి.

అయితే ఈ సినిమాతో ఆయన వసూళ్ళ పరంగానే కాకుండా నటన పరంగా కూడా ఆయన అందరి మన్ననలు పొందగలిగాడు. ఇక ఈ చిత్రం వచ్చేవారంలో కూడా వసూళ్ళ పరంగా బాగానే వసూలు చేయోచ్చు అని ట్రేడ్ వర్గాల సమాచారం. కారణం- ఈ వారం వచ్చిన చిత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోవడమే!

మొత్తానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రం మెగా ఫ్యామిలీకి, మెగా అభిమానులకి అలాగే సాధారణ ప్రేక్షకులకి కూడా ఒక గుర్తిండిపోయే చిత్రంగా మిగిలిపోయింది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS