బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్కి షూటింగ్ లో గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే, పద్మావతి షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ సందర్భంగా రణ్వీర్ సింగ్ గాయపడినట్టు సమాచారం. ఆ గాయం ఆయన నుదుటి భాగంలో అయినట్టు అతని ఫోటోలు చూస్తుంటే తెలుస్తుంది.
ఇక ఆసక్తికరమైన విషయమేమిటంటే, షాట్ చేస్తున్నపుడు ఎవరు ఆ గాయాన్ని గుర్తించలేదట! దర్శకుడు షాట్ కట్ చెప్పగానే, గాయం అయిన విషయాన్ని గమనించే వెంటనే రణ్వీర్ సింగ్ ని లీలావతి ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.
ప్రస్తుతం, రణ్వీర్ సింగ్ కి ఎటువంటి ప్రమాదం లేదు అని, ఒక రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే అంతా మామూలు అయిపోతుంది అని డాక్టర్లు చెప్పారు.