ఇదే మన ఎన్టీఆర్ టెంపర్ రీమేక్

మరిన్ని వార్తలు

అపజయాలతో కెరీర్ లో కొంత తగ్గిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మంచి విజయంతో పాటు ఒక కొత్త శైలిని ఇచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ కి అపజయం అనేదే లేదు అన్నది గమనార్హం.

ఇక ఈ టెంపర్ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రని హిందీ నటుడు రన్వీర్ సింగ్ పోషిస్తున్నాడు. దీనికి సంబందించిన టైటిల్ & ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ రీమేక్ చిత్రానికి సింబా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా కరణ్ జోహార్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్ 28న విడుదల చేస్తామని ప్రకటించడం కొసమెరుపు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS