ఇటీవల ముద్దుగుమ్మ శృతిహాసన్ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే విచిత్రమేంటంటే సినిమాల గురించి కాదు. ఆమె ఎక్కడ చూసినా తన బోయ్ ఫ్రెండ్‌తో కలిసి దర్శనమిస్తోంది. కెమెరా కళ్లకు చిక్కుతోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొన్నీమధ్యనే తన తల్లి సారికకు బోయ్ ఫ్రెండ్ మైఖేల్‌ని పరిచయం చేసింది. ఆ ఫోటోలు చూసి శృతిహాసన్ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇందుకు కంటిన్యూస్‌గా తండ్రి కమల్ హాసన్‌తో శృతి ఉన్న ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. ఓ పెళ్లి వేడుకలో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ సందడి చేశారు. ఇక్కడే చిన్న ట్విస్ట్. తండ్రీ కూతుళ్లే కాదు, శృతి తన బోయ్ ఫ్రెండ్‌తో కూడా కలిసుంది ఈ ఫోటోల్లో. అంటే తండ్రి కమల్ హాసన్‌కి శృతి తన బోయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసేసిందన్న మాట.
తమిళ నటుడు ఆదవ, వినోదినిల వివాహం మంగళవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి శృతి తన బోయ్ ఫ్రెండ్‌తో కలిసి హాజరైంది. కమల్ హాసన్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలోనే శృతి తన బోయ్ ఫ్రెండ్‌ని తండ్రికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోల సంగతి ఇలా ఉంచితే, శృతికి ఆల్రెడీ మైఖేల్‌తో పెళ్లయిపోయిందనీ, కాదు కాదు మైఖేల్‌తో సహజీవనం చేస్తోందంటూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంతుందో తెలీదు కానీ, శృతి - మైఖేల్ చెట్టాపట్టాలు చూస్తుంటే ఏమో నిజమేననిపిస్తోంది. ఏదేమైనా ఈ వివాహ వేడుకకు నిండైన ట్రెడిషనల్ వేర్లో శృతి జంట భలే కనువిందు చేస్తోంది. అలాగే అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది కూడా.