జక్కన్న కోసం రణవీర్ శపథం

మరిన్ని వార్తలు

మొదట టాలీవుడ్ లో జర్నీ మొదలుపెట్టిన రాజమౌళి, అంచలంచలుగా ఎదుగుతూ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడి స్థాయికి, RRR తో పాన్ వరల్డ్ స్థాయికి చేరుకున్నారు. స్టూడెంట్ నంబర్ వన్ తో కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళికి ఫ్లాప్ అంటే తెలియదు. ప్రజంట్ జక్కన్నకి ఉన్న క్రేజ్ ఏ దర్శకుడికి లేదని చెప్పాలి. రాజమౌళికి  సినిమాకి కావాల్సిన అన్ని విభాగాల్లో  పట్టు ఉండటం వలన ది బెస్ట్ ఔట్ పుట్ వస్తుంది. ఎంత టైమ్ తీసుకున్నా పర్ఫెక్ట్ గా వచ్చేవరకు తపిస్తాడు.    


RRR సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి, ఇద్దరి ఇమేజ్ ని మరింత పెంచాడు, తప్ప ఎవర్నీ ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు. RRR  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ అవార్డుని కూడా కేవలం ఒక పాటతో తీసుకువచ్చి తెలుగువారి ముంగిట పెట్టాడు. అందుకనే రాజమౌళి తో వర్క్  చేసేందుకు అన్ని ఇండస్ట్రీలకి చెందిన నటీ నటులు ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలోనే బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో రణవీర్ సింగ్ కూడా తన మనసులో మాట బయట పెట్టాడు.  


రణవీర్ సింగ్ బాలీవుడ్లో విభిన్న ప్రాజెక్ట్ లు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు . సంజయ్ లీలా బన్సాలి లాంటి క్రియేటివ్ దర్శకుడితో వరుసగా మూడు సినిమాలకి వర్క్ చేశాడు. అవన్నీ కూడా భారీ హిట్స్. రణవీర్ అద్భుతమైన నటుడు ఎలాంటి క్యారక్టర్ అయినా పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు. రణవీర్ సింగ్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకి రాజమౌలి సినిమాలో నటించాలని ఉందని, తన సినీజీవితం మొత్తంలో ఒక్క సారైనా జక్కన్నతో వర్క్ చేస్తానని ప్రతిన బూనాడు. దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి. రాజమౌళి సినిమాలో హీరోకి ఉండాల్సిన లక్షణాలు రణవీర్ కి పుష్కలంగా ఉన్నాయి. మరి వీరి కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS