రావు రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం..

By iQlikMovies - April 07, 2018 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ నటుడు రావురమేష్ గారికి మాతృవియోగం కలిగింది.

అందుతున్న సమాచారం ప్రకారం, ప్రఖ్యాత నటుడు కీర్తిశేషులు రావుగోపాల్ రావు సతీమణి అయిన కమలాకుమారి ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని వారి స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇక గతంలో కమలకుమారి గారు వివిధ ప్రాంతాల్లో హరికథ ప్రదర్శనలు ఇస్తూ ప్రఖ్యాత హరికథా కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రతిఒక్కరు రావురమేష్ ఇంటికి చేరుకొని కమలాకుమారి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళ్ళు అర్పిస్తున్నారు. ఇక కమలాకుమారి గారు ప్రస్తుతం తన కుమారుడు అయిన రావురమేష్ తో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు.

కమలాకుమారి గారి అకాలమృతికి www.iQlikmovies.com తరపున ప్రగాడ సంతాపం తెలియచేస్తున్నాము.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS